Saturday, November 10, 2012

నడుం .పొట్ట బాగా పెరిగిపోతుంటే ఒక నిమ్మకాయి రసాన్ని ఉప్పు పంచదార ఏమీ కలుపకుండా ఒక నెల రోజులు తాగండి .బాగా మార్పు కనిపిస్తుంది .
గిన్నెలు తోమినప్పుడు దుస్తులు ఉతికినప్పుడు అధిక సమయం నీటిలో నానడం వల్ల చేతులు తేమను కోల్పోయి కాంతి విహినం గా తయారు అవుతాయి అప్పుడు గోరు వెచ్చని నూనె లో పంచదార కలిపి చేతులకు మృదువుగా మసాజ్ చేస్తే మృదుత్వాన్ని సంతరించుకుంటాయి
గోళ్ళు పొడి బారి తరచూ విరిగిపోతుంటే పచ్చి పాలలో నువ్వుల నూనె గాని ఆల్మండ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ గాని కలిపి రాత్రి పూట ఒక పది నిముషాలు మసాజ్ చేస్తే సమస్య తగ్గిపోతుంది