Wednesday, November 7, 2012

కంటి క్రింద నలుపు పోవాలంటే రోజు ఆల్మండ్ ఆయిల్ పట్టించి ఒక అరగంట తరువాత చల్లని నీటిలో కాటన్ ముంచి మృదువుగా తుడిచివేయండి .ఇలా కనీసం నెల రోజులయినా క్రమం తప్పకుండా చేస్తే కళ్ళ క్రింద నలుపు ముడుతలు కూడా బాగా పోతాయి .
కాస్త అలసట వస్తే చాల మంది కళ్ళను నలిపేస్తూ ఉంటారు .ఇలా చేయడం వల్ల వెంట్రుకలు రాలిపోతాయి .కళ్ళు మంటలు గా ఉంటే చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి .
కళ్ళ కు మస్కారా లాంటివి ఎక్కువ సేపు ఉంచరాదు . బాదంనూనె విటమిన్ ఇ ఉన్న నూనె లతో కంటి రెప్పల మీద సున్నితం అప్పుడప్పుడు మసాజ్ చెయ్యాలి
లిక్విడ్ ఐ లైనర్ ఎక్కువగా పూస్తే అది చర్మరంధ్రాల లోకి ఇంకి వెంట్రుకలు పెరగనియకుండా చేస్తుంది .అందువలన ఎక్కువగా రాయరాదు .
బంగాళా దుంపలు గాని కిరా దోస గాని చక్రాలు గా తరిగి కళ్ళ మీద పది నిముషాలు ఉంచితే కళ్ళు, కనురెప్పలు ఆరోగ్యం గా ఉంటాయి .
కళ్ళ చుట్టూ నువ్వుల నూనె ను పడుకునేటప్పుడు రాసి మృదువుగా మసాజ్ చేసి ఉదయాన్నే చల్లటి నీళ్ళ తో కడుక్కుంటే నల్లటి వలయాలు తగ్గుతాయి