Wednesday, November 7, 2012

పులిపుర్లు ఎక్కువగా ఉంటే బొప్పాయి ఆకు ,కొమ్మ ,కాయి ,వీటిలో దేని నుంచి అయినా కారే పాలను అగ్గిపుల్లతో తీసుకుని పులిపుర్లకు పట్టించండి .పులిపుర్లు క్రమంగా రాలిపోతాయి .ఇంట్లో ఉండే సున్నం తీసుకుని రోజు పులిపిర్లు మీద రెండు పూటలా అంటిస్తే క్రమం గా తగ్గిపోతాయి .
బొప్పాయి లో విటమిన్ A ,క్యాల్షియం ,ఫోలిక్ యాసిడ్ ,b 6,b 1 విటమిన్లు ఉంటాయి .ఎక్కువ మొత్తం లో పీచు లభిస్తుంది .
అజీర్ణం తో బాధ పడేవారు ఎక్కువగా బొప్పాయి తినడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది .
దీనిలో పోషకాలు ఎక్కువ గాను కేలరీలు తక్కువగాను ఉంటాయి అందువలన  బరువు తగ్గాలనుకునే వారు బొప్పాయి తింటే చాలా ఉపయోగంగా ఉంటుంది .
ఆస్టియోపోరోసిస్ ,కీళ్ళనెప్పులతో నూ బాధ పడే వారు బొప్పాయి ముక్కలు తింటే మంచిది .
శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది .