Friday, November 9, 2012


నిద్ర పట్టనప్పుడు పాలలో రెండు చెంచాల తేనే చిటికెడు జాజికాయ పొడి గాని చిటికడు దాల్చిన చెక్క పొడి గాని కలుపుకుని త్రాగాలి .ఇంకా  నాలుగు బాదం పప్పులు పేస్టు చేసి దానితో బాటు గా చిటికెడు జాజికాయి పొడి పాలలో కలిపి పడుకోవడానికి ఒక గంట ముందు తాగితే బాగా నిద్ర పడుతుంది .
రాత్రి పెరుగు కన్నా పాలతో పటికబెల్లం కానీ బెల్లం కానీ కలిపిన అన్నం తింటే మంచి నిద్ర పడుతుంది .
పళ్ళ రసం గాని వేడి పాలతో పటిక బెల్లం కలుపుకుని తాగి పడుకున్నా కూడా నిద్ర వస్తుంది .
పడుకోవడానికి ముందు కొంచం సేపు నడవాలి కనీసం వంద అడుగులు నడచి పడుకుంటే మంచిది .
అరిపాదాలకు నువ్వులనూనె ఐదు నిముషాలు మర్దన చేసుకుని పడుకుంటే నిద్ర బాగా పడుతుంది .
రాత్రి గోరు వెచ్చని నీటితో స్నానం చేసి మాడుకి నువ్వుల నూనె మర్దన చేసుకుని పడుకుంటే మంచి నిద్ర వస్తుంది ఇలా పదకొండు రోజులు చెయ్యాలి