Thursday, December 27, 2012

cabbage.benifits

దీనిలో బీటా కేరేటిన్ ,విటమిన్ c ,ఫైబర్  ఉన్నాయి .ఇది ఒంట్లో వేడిని తగ్గిస్తుంది .బాగా చలవ చేస్తుంది . తేలికగా జీర్ణమవుతుంది .బాగా నిద్ర పట్టేటట్టు చేస్తుంది .
దీనిలో ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడమే గాక వెయిట్ తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది . ఇది కాన్సర్ రాకుండా నివారిస్తుంది .
ఇది అల్సర్స్ లోను ఇంకా చర్మరోగాలను తగ్గించడం లోను బాగా పని చేస్తుంది .ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది
పచ్చి కాబేజీ రసం రాస్తే చర్మం ఫైన  దద్దుర్లు గడ్డలు తగ్గుతాయి .
పిల్లలకు పాలు ఇచ్చే తల్లుల కు బ్రెస్ట్ నెప్పిగా ఉన్నప్పుడు క్యాబేజ్ ఆకులు అనగా దాని ఫై పొరలు వెచ్చ చేసి బ్రెస్ట్ మీద వేస్తే నెప్పులు తగ్గుతాయి .
కాబేజి లోని పీచు కీ కొలెస్ట్రాల్ ని అదుపు చేసే గుణం ఉంది .దీని లోని  విటమిన్ c శరీరం హానికారక ఫ్రీ రాడికల్స్ బారిన పాడకుండా కాపాడుతుంది .

Wednesday, December 26, 2012

tomoto.benifits



రోజూ  మనం  ఎన్నో రకాల కూరగాయలు వాడుతూ ఉంటాం .వాటివల్ల ఏ
మేమి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందామా .

1.టమేటా.ఇది రక్తంలోని పదార్ధాలను విసర్జింప జేసి రక్తం శుద్ధి పడేలా చేస్తుంది .ఇది బాగా చలువ చేస్తుంది .ఇది రక్తవృద్ధి ,దేహపుస్టి , బలము ను ఆరోగ్యము ను ఇచ్చును .

2.మలబద్ధకాన్ని నివారించడమే కాక దంతాల గట్టితనానికి ఎంతో ఉపయోగపడుతుంది .షుగర్ వ్యాధి ఉన్న వారికీ టమాటో సలాడ్ తింటే షుగర్ అదుపులో ఉంటుంది .

3.టమా టో  లోవిటమిన్ A ఎక్కువగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగ్గా ఉండడానికి ఎంతో ఉపయోగపడును .

4.దీనిలో ఉండే ఐరన్ వల్ల రక్తహినత రాదు .రక్తహినత ఉన్నవారు రోజు ఒక పండు టమేటా తింటే శరీరానికి రక్తం బాగా పడుతుంది .దీనిలో విటమిన్ c ఉండడంవల్ల గాయాలు ,తగ్గడానికి పిల్లలలో పెరుగుదలకు తోడ్పడుతుంది .దీనికి మరో పేరు రామములగాకాయ .

5.టమాటో లు మగ్గిపోతే  పా రవేయాల్సిన  అవసరం .ఉప్పు నీటి లో వేస్తే ఒకగంట అయ్యే సరికి గట్టిపడి వాడడానికి తయారుగా ఉంటాయి .

6. టమేటా ని గుజ్జు లా చేసి దానిలో తేనే కలిపి ముఖానికి రాసుకుని పది నిమిషాల తరువాత కడిగేస్తే ఇది స్కిన్ టైట్ గా పని చేసి ముఖం త్వరగా ముడుతలు రానీయదు 



Monday, December 3, 2012

ponnagantikura.benifits

పొన్నగంటి కూర ఆరోగ్యానికి చాల మంచిది
 .దీనిలో ఐరన్ ,కాల్షియం ,రిబోఫ్లోవిన్ ఉన్నాయి .ఇది చాల చలవ చేస్తుంది
 .జుట్టు ఊడే వారు ఈ ఆకు కూర తింటే జుట్టు బాగా పెరుగుతుంది .దీనిని తలకు హెన్నా మందార ఆకుల తో కలిపి పెట్టుకుంటే చుండ్రు పోతుంది
 .నోటిలో పొక్కులు ,నోటి పూత ఉన్న వారికి ఇది మంచి మందు .ఇది పైత్య మును తగ్గించి నోటికి రుచిని పుట్టిస్తుంది .ఇది కంటి బలాన్ని కలుగచేసి కంటిచూపు బాగా మెరుగు పరుస్తుంది .కాట రాక్ట్ రాకుండా కాపాడుతుంది .

pudina.benifits

పుదినా అనేక విటమిన్ల మరియు మినరర్ల సమాహారం అని చెప్పవచ్చు .ఇది అందరికీ అందుబాటు లో ఉండే అసాధారణ ఔషధం .ఇది చాల రకాలయిన అనారోగ్యాలకు మంచి మందు .
1.ఈ .ఆకును గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు ఆహారం లో తీసుకుంటే మంచి ఫలితముంటుంది .కడుపు లో మంట
కీళ్ళనొప్పులు ఉన్న వారికి ఇది చాల మంచిది .
2.పుదినా ను ఆహారం లో తీసుకోవడం చాల తేలిక .దీనిని పొడి గాను ,పచ్చడి గాను ,సాస్ గాను ,టీ చేసుకుని ఇంకా అన్ని కూరలలోను వాడవచ్చు
3ఈ పుదినా త్వరగా జిర్ణమవ్వడమే గాక ఆకలి లేనివారికి ఆకలి కలిగించి జీర్ణ శక్తి ని పెంచుతుంది .
4.రోజు ఈ ఆకులు నాలుగు నమిలితే పిప్పిపళ్ళు రాకుండా చేసి పళ్ళు దంతాలు గట్టిగా ఉంటాయి .నోటి దుర్వాసన ఉన్న వారికి ఇలా నమలడం వల్ల నోరు ఫ్రెష్ గా ఉంటుంది .
5.మొటిమలు ఉన్నవారు రాత్రి నిద్ర పోయేముందు ఈ రసం రాసుకుని ఉదయాన్నే కడిగేయాలి .ఇలా ఒక వారం రోజులు చేస్తే మొటిమలు పోయి ముఖం కాంతివంతం గా అవుతుంది .పొదినా లో ఉండే విటమిన్ ఎ చర్మానికి జిడ్డు పట్టకుండా చేస్తుంది .

Sunday, December 2, 2012

mentikura.benifits

మెంతికూర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి .
1.దీనిలో ప్రోటీన్స్ విటమిన్ c ఇంకా ఈస్త్రోజిన్ మొదలైనవి .ఈ ఈస్త్రొజిన్ హార్మోన్ లేడీస్ కి మేనోపాస్ లో సమస్యలు రాకుండా ఉంటాయి
2.ఇది కీళ్ళ నెప్పులు .అస్తమా ,బ్రాంకై టిస్ ,ఎలేర్జీస్ ,టైప్ 2 డయా బెటిస్  రోగులకు చాల మేలు చేస్తుంది .
3.టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళు మెంతి ఆకు రసాన్ని 500mg  చొప్పున రోజు 2 సార్లు తాగితే డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది .
4.దీనికి తేలిగ్గా జీర్ణమయ్యే గుణం వల్ల అన్ని వయసు ల వారు దీనిని తినవచ్చు .ఇది కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచడం లో నూ వెయిట్ తగ్గించడం లోను ఎంతో ఉపయోగ పడుతుంది .