Wednesday, November 7, 2012

అరికాళ్ళ మంటలు ,ఒళ్ళు మంటలు అని బాధ పడేవారు రోజు ఉదయం ,రాత్రి ఒక కప్పు పాలలో కొంచం అంటేపెసర గింజ అంత పచ్చ కర్పూరం కలిపి కలిపి తాగితే ఈ మంటలు తగ్గిపోతాయి .

గోరింటాకు రసాన్ని పడుకునేటప్పుడు అరికాళ్ళకు రాస్తే కాళ్ళ మంటలు తగ్గుతాయి

.
ధనియాలు వంద గ్రాములు తీసుకుని వేయించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి . జీలకర్ర కూడా వంద గ్రాములు తీసుకుని కొంచం వేడి చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇది బాగా వేయిన్చారాదు  ఇవి వేయించేటప్పుడు నూనె గాని నెయ్యి గాని వెయ్యరాదు . తరువాత వంద గ్రాముల సోంపు తీసుకుని దీనిని కూడా గ్రైండ్ చేసుకుని ఈ మూడు పొడులను కలిపి ఒక బాటిల్ లో పోసి పెట్టుకుని ఒక పెద్ద గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల పొడి వేసి ఆ నీరు సగం అయ్యేవరకు మరిగించాలి ఆ నీటిని వేడిగా ఉన్నప్పుడు త్రాగాలి ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల అన్ని రకాల కాళ్ళ మంటలు అనగా ఫంగస్ వల్ల కానీ చెప్పులు పడకపోవడంవల్ల గని షుగర్ వ్యాధి వల్ల గని విటమిన్ B లోపం వల్ల గాని వచ్చిన కాళ్ళ మంటలు బాగా తగ్గుతాయి

రోజు రాత్రి పడుకునేటప్పుడు ఆముదం మసాజ్ చేస్తే కాళ్ళ మంటలు తగ్గుతాయి .