Friday, November 9, 2012

 వేపపువ్వుని సేకరించి ఎండబెట్టి నేతిలో వేయించి జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి కూడా వేయించుకుని తగినంత ఉప్పు వేసి పొడి చేసుకుని అన్నంలో తింటే కడుపులో పుండు, ఫైత్యం తల తిరడగం తగ్గుతాయి .
కాళ్ళ పగుళ్ళు తగ్గకుండా బాధ పడేవారు గుప్పెడు వేప ఆకులు తీసుకుని కొంచం పసుపు కలిపి నీటిలో మరిగించి ఆ నీటిలో పాదాలు కొంచం సేపు ఉంచితే కాళ్ళ పగుళ్ళు త్వరగా తగ్గిపోతాయి ఇలా కొన్ని రోజులు చేస్తే కాళ్ళ పగుళ్ళు త్వరగా రావు