Saturday, November 10, 2012

పాలలో గంధం పొడి పసుపు శనగపిండి కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి రాసి ఒక పావు గంట తరువాత కడిగితే మొటిమలు పోతాయి

కీర దోస పేస్టు చేసి ముఖానికి రాసుకుంటే మంగు మచ్చలు కళ్ళ క్రింద నలుపు కూడా పోతాయి

నిమ్మరసం రాసుకుంటే ముఖం ముడుతలు పడదు .ఇది స్కిన్ టైట్ చెయ్యడం లో ఎంతగానో ఉపయోగ పడుతుంది

నీళ్ళలో పది వేపాకులు నారింజ తొక్కలు వేసి మరిగించి దానిని నూరి ముద్దగా చేసుకుని దానిలో తేనె పెరుగు సోయపాలు కలిపి పేస్ట్ చేసి ఫ్రిజ్ లో ఉంచుకుని వారానికి మూడు సార్లు ఫేస్ పాక్ వేసుకుంటే మచ్చలు పోతాయి

జిడ్డు తత్వం ఉన్నవారు పెరుగు వేపపొడి నిమ్మ రసం కలిపి పేస్ట్ చేసి ముఖానికి రాసుకుని పావు గంట తరువాత కడిగేస్తే తాజాగా ఉంటుంది

మెరిసే ఛాయ కావాలంటే వేపపొడి గులాబీ రేకుల పొడి పెరుగు పాలు కలిపి ముఖానికి మెడకి పట్టించి పావు గంట అయ్యాక కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది