Saturday, November 10, 2012

కీళ్ళ  నెప్పులు ఉన్నవారు మెంతి కూరను రోజూ ఆహారం లో భాగంగా తీసుకోవాలి .మెంతి పిండి కూడా తినవచ్చు దాల్చిన చెక్క ను నీటితో అరగదీసి ఆ పేస్టు ను నెప్పి ఉన్న చోట రాయాలి
.మడమలు నెప్పి తో బాధ పడే వారు ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరగాలి
వెల్లుల్లి, పసుపు ,అల్లం ఆహారంలో ఎక్కువ తీసుకుంటే మడమ నెప్పి తగ్గుతుంది . రాత్రి నిద్ర నుండి లేవగానే నువ్వుల నూనె తో పాదాన్ని వ్రేళ్ళ ని మడమ ని సున్నితం గా మర్దన చేస్తే రోజంతా మడమల నెప్పి బాధించదు
నువ్వుల నూనె కాచి అందులో ఒక వెల్లుల్లి పాయి వేసి చల్లారాక పాదానికి మర్దన చేసి కాపడం పెడితే నెప్పి త్వరగా తగ్గిపోతుంది