Saturday, November 24, 2012

karivepaku.benifits

.కరివేపాకు .ఇది చాల మంచి ఔషధ గుణాలు కలిగిన ఆకు .
ఇది లేనిదే వంట పూర్తి కాదు .అయితే చాల మంది దీనిని ఏరి పారవేస్తారు .
ఈ ఆకు వల్లశరీరానికి మంచి మెరుపు వస్తుంది .ఇది మంచి ఆకలి కలిగించి తిన్న ఆహారాన్ని బాగా జీర్ణం అయ్యేటట్టు చూస్తుంది .
ఇది ఎండబెట్టి పొడి చేసి రోజు ఒక స్పూన్ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది .
ఈ పచ్చి ఆకులు అప్పుడప్పుడు నాలుగు తిన్నా కూడా కంటి చూపు మెరుగుపడుతుంది .
కరివేపాకు తో కారప్పొడి చేసుకుని అన్నం లో మొదటి ముద్ద లో నేతితో తింటే అజీర్తి రానే రాదు . 

gangapavili kura.benifits

ఈ గంగ పావిలి కూర  చాల చలవ చేస్తుంది .శరీరం లో వేడిని తొలగిస్తుంది
 .కఫాన్ని కరిగించి ఊపిరి తిత్తుల్ని శుభ్రపరుస్తుంది .దగ్గు ఆయాసం తగ్గిస్తుంది
 .కీళ్ళనొప్పులు .కడుపునొప్పులు మొదలైన వాత రోగాలను తగ్గిస్తుంది .రక్త దోషాలను పోగొట్టి రక్తాన్నిశుభ్రపరుస్తుంది
 .దద్దుర్లు ,దురదలు మొదలైన చర్మరోగాలు తగ్గిస్తుంది
.ఈ ఆకు రసం ఎముకల్లో కాల్షియం తగ్గిపోయినవారికి మంచి ఫలితాన్నిస్తుంది
.ఈ ఆకు రసం అర గ్లాస్ తీసి పెరుగు లో కలిపి మూడు రోజులు ఉదయాన్నే ఇస్తే కామెర్లు తగ్గుతాయి .విషాహారాలకు ఇది మంచి మందు .

Wednesday, November 21, 2012

kottimira.benifits

కొత్తిమీర అంటే ధనియాల మొక్క .ఈ కొత్తిమీరను ఎక్కువగా వాడడం వల్ల చాల మేలు జరుగుతుంది .ఇది బాగా ఆకలి పుట్టిస్తుంది .నోటి అరుచి ని పోగొడుతుంది .ఆహారాన్ని జీర్ణం చేస్తుంది .పొట్టను తేలికగా ఉంచుతుంది .మంచి నిద్ర ను కలిగిస్తుంది .10గ్రాముల ఆకుల ముద్ద ను ఒక పెద్ద గ్లాస్ నీటిలో మరిగించి ఆ నీటితో పుక్కిలి పడితే నోటి పూత తగ్గుతుంది  మరియు పండ్ల నొప్పులు పిప్పి పళ్ళు కూడా తగ్గుతాయి .ఈ కషాయం లో పంచదార వేసి తాగితే ఆకలి బాగా పెరుగుతుంది .దీనిని రోజు అన్నంలో తింటుంటే జీర్ణ శక్తీ పెరిగి అన్ని రోగాలు తగ్గుతాయి .

Friday, November 16, 2012

gongura.benifits

శరీరం లో నీరు చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాల మంచిది .గోంగూర ఆకు ఆముదం తో కలిపి వెచ్చ చేసి వ్రణాల పైన గడ్డల పైన కడితే త్వరగా తగ్గిపోతాయి .తరచూ గోంగూర వాడుతూ గోంగూర పువ్వులను దంచి అర కప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది .దగ్గు ఆయాసం తుమ్ములతో బాధ పడే వారికీ చాలామేలు చేస్తుంది .

Thursday, November 15, 2012

bachhalikura.benifits

బచ్చలి కూర శరీరం లోని పైత్యన్ని కఫాన్ని తగ్గిస్తుంది .విషాన్ని హరిస్తుంది .నోటికి రుచిని  పుట్టిస్తుంది ఎక్కువగా తింటే ఆకలి కలిగిస్తుంది .ఈ ఆకు పచ్చిది నమిలితే లేదా ఈ ఆకు రసం పుక్కిట పడితే దంత రోగాలు తగ్గుతాయి .పంటి నొప్పులు బాధలు తగ్గి పళ్ళు గట్టిపడతాయి .నోటి వెంట పడే రక్తాన్ని ఆపుతుంది .ఈ ఆకులు నూరి గడ్డల పై కడితే కఠిన మైన గడ్డలు కూడా కరిగిపోతాయి .దీనిలో విటమిన్ ఎ ,బి లతో బాటు సి ,మాంసకృత్తులు కూడా ఉంటాయి .ఇవి జ్ఞాపక శ క్తి ని బ బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది .

totakura.benifits

ఈ కూర తినడంవల్ల ఉబ్బు రోగాలు తగ్గిపోతాయి
.ముక్కు వెంట నోటి వెంట పడే రక్తాన్ని ఇంకా అమితంగా అయ్యే రక్త స్రావాలను అరికడుతుంది
 .దీనిలో ఎ,బి ,సి విటమిన్ ల తో బాటు ఎక్కువ శాతం ఐరన్ ఉంది .ఇది కడుపు లోని నులిపురుగులను హరింప జేస్తుంది .

palakura benifits


పాలకూర వాడడం వల్ల పెద్దపేగు ,ఊపిరితిత్తుల లోను కాన్సర్ రాకుండా చిన్న ప్రేగుల్లో జీర్ణ సంబధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది
 .పాలకూర తింటే మైగ్రేన్ తలనొప్పి ఇతర తలనొప్పుల నుండి కాపాడుతుంది
 .దీనిలో ఉండే బి .విటమిన్ డిప్రెషన్ రానివ్వదు .
ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడంవల్ల గర్భిణి స్త్రీ లకు ఎంతో మంచిది .
పాలకూర లో విటమిన్ .c ,కాల్షియం ,బీటాకేరిటన్ .ఉంటుంది .ఇంకా ఇందులో ఉండే ప్రత్యేకమైన పీచు గుండె లాంటి కీలక అవయవాలు సరిగా పని చేస్తాయి
.కళ్ళకెంతో మంచిది శుక్లాలు రాకుండా కండరాలు క్షీణిం చ కుండా కాపాడుతుంది .
ఇది ఎముకల ఆరోగ్యానికి చాల మంచిది  ఆస్త్రియోపోరోసిస్ రాకుండా చూస్తుంది .పాలకూర ఆరోగ్యానికి ఇంకా చాల మేలు చేస్తుంది కనుక కనీసం వారానికి ఒక సారయన తీసుకోవాలి .

chukkakura.benifits

ఆకుకూర ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి
.చుక్కకూర ఎక్కువగా వాడుతుంటే రక్త దోషా లను పోగొట్టి చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది .
ఇది చాల తేలిక గా జీర్ణమవుతుంది .
జుట్టు రాలనివ్వదు .రక్త హీనత గుండె జబ్బులు రానివ్వదు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది
 చుక్కకూర ఆకులు రసంతీసి ఒక అర గ్లాస్ రసం పాలలో గానీ పెరుగు లో గాని కలిపి తాగితే 5రోజులలో కామెర్లు తగ్గుతాయి
 ,ఔన్సు చుక్కకూర రసం లో షోడాఉప్పు కలిపి తాగితే కడుపు నెప్పులు ,కీళ్ళనెప్పులు తగ్గుతాయి .
ఇది మలబద్ధకాన్ని పోగొట్టి కాల విరేచనం అయ్యేటట్టు చేస్తుంది .ఆకలి పుట్టిస్తుంది
.విటమిన్ ఎ ,బి లతోబాటు ఎక్కువశాతం కాల్షియం అందిస్తుంది చుక్కకూర . 

tips for bright skin

తేనె ఆలివ్ ఆయిల్ ,బాదం ఆయిల్ ,రోజ్ వాటర్ ,పెరుగు అన్నీ సమ పాళ్ళలో కలిపి మిశ్రమం లా చెయ్యాలి .దీంతో ముఖాన్ని బాగా మసాజ్ చేసి అరగంట అయ్యేక శుభ్రపరిస్తే పొడిచర్మం తేమ గా అవుతుంది .
ఆపిల్ ముద్దను ముఖానికి మసాజ్ చేసి పావుగంట అయ్యాక కడిగేస్తే ముఖం కాంతివంతం గా అవుతుంది .

ముల్తాని మట్టి కి పుదినా రసం కలిపి మెత్తని పేస్ట్ లా చేసి రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి మర్నాడు ప్యాక్ లా వేసుకోవాలి కాసేపయ్యాక చల్లని నీటితో కడిగేస్తే చర్మం లో మృతకణాలు పోతాయి .
పొడి చర్మం కలిగిన వారు అలోవేర గుజ్జు లో ఆలివ్ ఆయిల్ కలిపి రాస్తే చర్మం నునుపు గా అవుతుంది
చర్మానికి  కొద్దిగా తేనె రాసుకుని కాసేపయ్యాక కడిగెయ్యండి .చర్మం పట్టు లాగా మెరుస్తుంది .
అరటిపండు చిన్న ముక్క తీసుకుని దానిలో కొంచం తేనె కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడిగితే ముఖం తాజా గా ఉంటుంది
ఒక టీ స్పూన్ ఓట్ మిల్ పౌడర్ ఒక టీ స్పూన్ బాదం పొడి కొంచం పెరుగూ కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడుక్కుంటే మృత కణాలు పోయి ముఖం ఫ్రెష్ గా ఉంటుంది .
అలోవిరా గుజ్జు లో బాదాం పప్పు పేస్ట్ తేనే రోజ్ వాటర్ కలిపి ఎండ లో బయటికి వెళ్లి వచ్చినప్పుడు రాసి ఇరవై నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖం కడుక్కుంటే ఎండ వలన వచ్చే సమస్య తగ్గి ఫ్రెష్ గా ఉంటుంది
 ద్రాక్ష అంటే ఇష్టపడని వారు ఉండరు .వయసు మళ్ళిన వారి నుండి చంటి పిల్లలవరకు తినడానికి ఎంతో తేలికగా ఉంటుంది .

 ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి .అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయి .

ఈ పండ్లలోని టన్నిస్ ఫాలిఫినాల్స్ కాన్సర్ సంబంధ కారకాల ఫై పోరాడుతాయి .

శరీరం లో క్రొవ్వు ను తగ్గిస్తాయి

 ఇందులో ఏంటి ఆక్సిడెంట్ దృష్టి లోపాలను సవరించి కంటి చూపు మెరుగుపరుస్తుంది .

తలనెప్పి తో బాధ పడేవారు ద్రాక్ష తింటే వెంటనే తలనెప్పి తగ్గిపోతుంది .

జీవం కోల్పోయిన జుట్టు కు ద్రాక్ష గింజలు నూరి పట్టిస్తే జుట్టు కాంతివంతం అవుతుంది .

ఇవి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి గుండె కవాటాల పని తీరు మెరుగుపరుస్తుంది
.
ఒక ద్రాక్ష పండు తీసుకుని బాగా మెత్తగా చెయ్యాలి .దీనిలో ఒక అర స్పూన్ పంచదార కలిపి ముఖానికి రాసుకుని పంచదార కరిగేదాకా సున్నితంగా మసాజ్ చెయ్యాలి .బాగా ఆరి పోయాక శుభ్రం గా కడిగేయాలి .ఇలా క్రమం తప్పకుండ చేస్తే రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం మీద మచ్చలు ,ముడుతలు పోయి ఎంతో బాగుంటుంది

ద్రాక్ష పండు ఫై త్యాన్ని వాతాన్ని హరిస్తుంది.
 నీరసంగా ఉన్నవారికి గ్రేప్ జ్యూస్ ఇస్తే వాళ్ళు ఎంతో హుషారు గా తయారవుతారు .
 పిల్లలకు తరచుగా ద్రాక్ష పెట్టడంవల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది .ఇవి తరచుగా తినడంవల్ల రక్తహీనత ఉండదు .

మూడు ద్రాక్ష పండ్లను మెత్తగా మెదిపి ఆ గుజ్జు లో ఒక స్పూన్ మిల్క్ పౌడర్ ఒక స్పూన్ గంధం కొంచం పాలు కలపి ముఖానికి పాక్ వేసుకుని పది నిమిషాలయ్యాక కడిగేస్తే ఎండాకాలం లో కలిగిన వేడి తగ్గుతుంది ఇది రాత్రిపూట చెయ్యడం వల్ల ఉదయానికి చర్మం తాజా గా ఉంటుంది 

ఆయాసం తగ్గడానికి మసాలా దినుసులు బాగా ఉపయోగపడతాయి .
అవి ఎలాగంటే ఒక  యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు,సొంఠి బిరియాని ఆకు తీసుకుని సొంఠి మిరియాలు విడి విడిగా నేతిలో వేయించాలి .అన్నీ కలిపి మెత్తగా పొడి చేసి ఈ మొత్తానికి సమానంగా పంచదార కలిపి ఒకటి లేక రెండు స్పూన్ల పొడి ని రెండు పూటలా తింటే ఆయాసం తగ్గిపోతుంది .
ఆయాసం ఉన్నవారు ఆహారం లో గోధుమలు ,సోయాబీన్స్ టమేటా ,ఎండు ద్రాక్ష  ఎక్కువగా తీసుకోవాలి .
అలాగే వీరు కాల్షియం ఎక్కువగా ఉన్న పాలకూర క్యారెట్ ఉసిరి వాము జీలకర్ర మొదలైనవి తప్పనిసరిగా
తీసుకోవాలి . అరిటిపండు పెరుగు చల్లటి నీరు తీసుకోరాదు 

ఎండు ఖర్జూరం వేడి నీటిలో నానబెట్టి ఆనీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఆ నీళ్ళ లో తేనె కలుపుకుని త్రాగితే అస్మా వారికి మంచిది .
మెంతులు అరస్పూన్ వాము ఒక స్పూన్ గ్లాస్ నీటిలో అర గ్లాస్ అయ్యే వరకు మరగించి వడపోసుకుని ఆ నీరు తాగితే ఆయాసం తగ్గుతుంది

Wednesday, November 14, 2012

గులాబ్ జామున్ ల పిండి కలిపేటప్పుడు దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపితే మృదువుగా వస్తాయి .
2అలాగే కలిపే టప్పుడు ఒకవేళ పొరపాటున పిండి పలుచగా అయితే దానిలో కొంచం మైదా గాని మిల్క్ పౌడర్ గాని కలిపితే గులాబ్ జాం బాగా వస్తాయి .
3ఏదయినా పిండివంట చేయడానికి పాకం పట్టేటప్పుడు ఆ బెల్లం గాని పంచదార గాని కరగగానే ఆ పాకం నీటిలో ఒక స్పూన్ పాలు పోస్తే దానిలో ఉన్న మలినాలన్నీ ఫైకి తెట్టు లాగా వస్తాయి అప్పుడు ఆ తెట్టె ను గరిటతో తీసేస్తే ఆ పాకం ఫ్రెష్ గా ఉం టుంది
కరివేపాకు  కొత్తిమేర ఆకుకూరలు ఫ్రిజ్ లో ఉంచినా కూడా పాడవకుండా ఉండాలంటే అవి ఉంచిన కవర్లో ఒక పేపర్ ముక్క ఉంచాలి పేపర్ ఎక్కువగా ఉన్న తడిని పిల్చుకుంటుంది గ్రేప్స్ లాంటి ఫ్రూట్స్ ని కూడా ఇలానే నిలవచేసుకోవచ్చు
గోధుమ రవ్వ ప్లాస్టిక్ కవర్ లో ఉంచి ఫ్రిజ్ లో పెడితే ఎంత కాలమున్న పాడవ్వదు 


జామ ఆకులు నమలడం వల్ల పంటి పోటు తగ్గుతుంది .జామాకు నూరి వేడి నీళ్ళలో కలిపి సగం నీళ్ళు అయ్యేవరకు బాగా మరిగించి చల్లార్చి ఆ నీళ్ళు వడగట్టి పుక్కిట పట్టాలి దీనివల్లదంత వ్యాధులు చిగుళ్ళ వాపు గొంతు నెప్పి టాన్సిల్స్ వాపు నోటి పూత తగ్గి చిగుళ్ళ నుంచి రక్తం కారడం కూడా తగ్గుతుంది . 

అరటికాయి లు ,వంకాయి లు తరిగేటప్పుడు ఉప్పు కలిపిన నీటిలో తరిగితే నల్లబడవు  బియ్యం కడిగిన నీటిలో వేసిన కూడా నల్లబడవు .

కూరలు ఎక్కువ నూనె పోసి వేయించరాదు .ముందుగా కొంచం నీరు పోసి గాని ఆవిరి మీద గాని ఉడికించి తాలింపు పెడితే విటమిన్లు పోకుండా ఉంటాయి పైగా తక్కువ నూనె సరిపోతుంది .
కూరలు వండేటప్పుడు కావలసినంత నీరు మాత్రమే పొయ్యాలి.ఎక్కువ నీరు పోసి ఉడికించి ఆ నీటిని పారబోయడం వల్ల వాటిలో పోషకాలు పోతాయి .
కూరలు ఉడుకుతున్నపుడు అదీ ఆకు కూరలు ఉడుకుతున్నపుడు మూత పెట్టాలి .ఇలా చేస్తే విటమిన్ c నశించదు .
వండిన కూరలకు కొద్దిగా నిమ్మరసం కలిపితే మంచి రుచి .రంగు రావడమే గాక నీటి లో కరిగిపోయే పోషక పదార్ధాలు పోకుండా ఉంటాయి .
సిట్రస్ ఫలాలను అరటిపళ్ళ ను కలిపి వండ వద్దు సిట్రస్ ఫలాల వల్ల పాలు విరిగిపోతాయి .అరిటి పండు లో కలిపితే కఫం పెరుగుతుంది .పప్పులు .మొలకలు .కలిపి లేదా ఒకే సారి తినద్దు .రెండు ప్రోటీన్లు అధికంగా ఉండేవే కనుక అరగడం కష్టమవుతుంది .
తాలింపు పెట్టేటప్పుడు నూనెనెయ్యి కలిపి పెట్టకూడదు ఏదో ఒక దానిని మాత్రమే ఉపయోగించాలి

 .వంట షోడా వాడద్దు అది పోషకాలను హరిస్తుంది .పిండివంటలు చేసేటప్పుడు భాండి లో పోసిన నూనె పొంగకుండా ఉండాలంటే
ఆ నూనె లో చిన్న చింత పండు ఉండగా చేసి వేస్తే నూనె పొంగదు

స్టవ్ ఎక్కువ జిడ్డు పట్టి వదలకపోతే ఉప్పు వెనిగర్ కలిపిన మిశ్రమం తో తుడిస్తే చాలా బాగా శుభ్రపడుతుంది .

బిస్కెట్ ఎక్కువ కాలం కరకర లాడుతూ ఉండాలంటే అవి ఉంచిన డబ్బా లో కొంచం పంచదార వేయాలి

ఏవైనా కూరలు గానిపిండివంటలు గాని చేసేటప్పుడు ముందు పాత్ర బాగా వేడి ఎక్కాక నూనె పోయాలి
 బాగా సెగ తగ్గించి నూనె పోస్తే పాత్ర వేడెక్కుతుంది .ఇలా చేస్తే నూనె నుంచి అతి తక్కువ రసాయనాలు విడుదలవుతాయి
 .ఒకసారి వాడిన నూనె ఇంకో సారి వాడద్దు .
దేనిలో నైన తేనె కలిపాక వేడి చెయ్యద్దు .వంటకం గది ఉష్ట్నోగ్రత కు వచ్చాక లేదా ఆరిన తరువాత దానిలో తేనె కలపాలి .తేనె కలిపి వేడి చేస్తే అది అరగదు .పైగా జబ్బు చేస్తుంది
పూరీలు రుచిగా ఉండాలంటే రెండు మూడు బ్రెడ్ స్లైస్ లను పిండి లో వేసి కలపాలి
చపాతీలు చేసేటప్పుడు గోధుమపిండి లో కొంచం బియ్యం పిండి కలిపితే చపాతీలు మృదువుగా తేలికగా ఉంటాయి .
ఫ్రిజ్ లో ఒక మూల చిన్న గిన్నె లో తినే షోడా ఉంచితే వస్తువులు ఫ్రిజ్ కూడా వాసన రాకుండా ఉంటాయి
గట్టిపడిన బ్రెడ్ ముక్కలు రెండు సెకన్లు కుక్కర్ ఆవిరి కి ఉంచితే మెత్తగా అవుతాయి
పాలు త్వరగా తోడుకోవాలంటే పెరుగుతో బాటు ఓ చిటికెడు ఉప్పు ఒక పచ్చిమిరపకాయ వేస్తే తొందరగా తోడుకుంటుంది
గ్రేవీ కూరలు చేసేటప్పుడు జీడిపప్పు లేదా పల్లీ గసగసాలు లేదా కొబ్బరి పాలు వాడుకోవచ్చు 
కూరగాయలను ముందు కడిగాక తరిగి వండుకోవాలి .ముండుతరిగితే విటమిన్లు పోతాయి .మరీ సన్నగా తరగరాదు ఆకుకూరలు వండేటప్పుడు పావు స్పూన్ పంచదార వేస్తే వాటి రంగు మారదు
 .ప్లాస్టిక్ డబ్బాలు కడిగాక కూడా వాసన పోకపోతే బేకింగ్ షోడా నీటిలో కలిపి బాటిల్స్ లో పోసి ఒక అర గంట అలాగే వదిలెయ్యాలి ఆతరువాత వాటిని కడిగితే వాసన పోతుంది .

డబ్బాల లోపల న్యూస్ పేపర్ ముక్కలు నింపి ఒక రోజంతా అలా వదిలేసినా కూడా వాసనలు పోతాయి

ఫ్లవర్ వాజ్ లో పువ్వులు కొమ్మలు త్వరగా ఎండిపోకుండా ఉండాలంటే ఆ నీటిలో కొంచం పంచదార కలపాలి

చల్లని నీటిలో రోజ్ వాటర్ గాని నిమ్మ రసం గాని కలిపి పువ్వులపై అప్పుడప్పుడు చల్లుతూ ఉంటే అవి ఫ్రెష్ గా ఉంటాయి

కాకరకాయ ,మెంతులు వంటి చేదు పదార్ధాలు వండేటప్పుడు వాటి లోని చేదు పోకుండా వండుకోవాలి .వీటి లోని చేదు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది                                        .
                                   కాకరకాయ చేదు గా తినడం ఇష్టం లేనివారు

                                                   వాటిని ముక్కలు గా కట్ చేసాక వాటిలో ఉప్పు వేసి పిండాలి .తరువాత ఉప్పు
నీటిని తీసివేసి కూర వండుకుంటే చేదు ఉండదు .కొంచం మజ్జిగ వేసి ఉడికించిన కూడా చేదు పోతుంది
.
కాకరకాయ ముక్కలను తరిగాక కొంచం సేపు బియ్యం కడిగిన నీటిలో వేసి ఉంచితే చేదు పోతుంది

dry skin tips

చలి కాలం లో పిల్లలకు ఒళ్ళంతా పగిలి తెల్లగా అవుతుంది ఇలా కాకుండా ఉండాలంటే స్నానం చేసే నీటిలో ఒక నాలుగు చుక్కలు కొబ్బరి నూనే గాని ఆలివ్ ఆయిల్ గాని వేసుకోవాలి .

పచ్చి పాలు రోజ్ వాటర్ కలిపి స్త్నానం చెయ్యడానికి ఒక అరగంట ముందు ముఖానికి మెడకు చేతులకు పట్టించి ఆ తరువాత స్త్నానం చేస్తే చాల బ్రైట్ గా అవుతారు .ఇలా ముందు ఒక 15రోజులు చెయ్యాలి .తరువాత రెండు లేక మూడు రోజులకు సారి చేసినా సరిపోతుంది .
కప్పు రాక్ సాల్ట్ ను స్నానం చేసే నీటిలో కలపాలి .దీనివల్ల అలసట తగ్గుతుంది
.బకెట్ నీళ్ళలో ఒక కప్పు మిల్క్ పౌడర్ కలిపి స్నానం చేస్తే రోజు అంతా ఫ్రెష్ గా ఉంటుంది .అది కుదరకపోతే స్నానానికి ముందు పచ్చిపాలు చర్మానికి రాసుకోవాలి
.అలసట ,ఒత్తిడి తగ్గాలంటే గుప్పెడు తులసి ఆకులు గాని గుప్పెడు గులాబీ రేకులు గాని స్నానం చేసే నీటిలో వేసుకోవాలి
.నిమ్మ నూనె 5లేక 6చుక్కలు వేసుకుని స్నానం చేసినా కూడా ఫ్రెష్ గా ఉంటుంది .యూకలిప్టాస్ నునె కలిపి స్నానం చేస్తే శరీరం మంచి వాసన వస్తుంది .






face tips for summer

రోజూ ఎండ తగిలి ముఖం నల్లగా అయిన వారికి తెల్లగా అవ్వాలంటే ప్రొద్దున పూట నాలుగు బాదంపప్పులుమెత్తగా చేసుకుని దానిలో పొదినా రసం పెరుగు తేనె కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమల మచ్చలు పోతాయి

 శనగలు ఒకరెండు స్పూన్లు  నీటిలో నానబెట్టాలి .సాయింత్రం వాటి మీద పొట్టు తీసి కొన్ని పాలు పోసి మెత్తగా రుబ్బాలి .ఈ పేస్ట్ ను పడుకునేముందు ముఖానికి రాసుకుని ఉదయాన్నే కడిగేయాలి .ఇలా 15రోజులు చేస్తే ముఖం తెల్లగా అవుతుంది

.ఒక స్పూన్ కీర దోస రసానికి నాలుగు చుక్కల రోజ్ వాటర్ పాలు కలిపి ముఖానికి చేతులకు పట్టించి పావుగంట తరువాత కడిగేస్తే చర్మం మంచి నిగారింపు సంతరించుకుంటుంది .

తేనీరు చల్లార్చి ఫ్రిజ్ లో ఉంచి దూది ముంచి అలసిన కళ్ళ ఫై ఉంచుకుంటే రిలాక్సింగ్ గా ఉంటుంది

స్ట్రాబెర్రీ ని పేస్టు చేసి ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడిగేస్తే ముఖం ఫ్రెష్ గా ఉంటుంది .

 ఎండ లో నుంచి వచ్చినప్పుడు షోడా వాటర్ తో ముఖం కడుక్కుంటే అలసట పోతుంది ఎండ దెబ్బ తగలదు

బాగా పండిన అరిటిపండు గుజ్జు గా చేసుకుని దానిలో ఒక స్పూన్ తేనే రెండు స్పూన్ల పాల మీగడ కలిపి మెత్తగా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని డీప్ ఫ్రిజ్ లో పావు గంట ఉంచి తరువాత ముఖానికి పట్టించి ఒక పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో తడిపి వ్రేళ్ళ తో మృదువుగా మసాజ్ చేసుకుని తరువాత కడిగేస్తే ముఖం మెడ బ్రైట్ గా ఎంతో బావుంటాయి .

నారింజ పండు  తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసి దానిని పెరుగులో కలిపి ముఖానికి రాసుకుంటే మెరుపుగా ఉంటుంది .
ముఖం పొడిబారి నట్టు ఉంటే గుప్పెడు పొదిన ఆకుల్ని తీసుకుని వేడినీటిలో మరిగించి వేడి చల్లారాక ముఖానికి రాసుకుని బాగా ఆరాక కడిగేస్తే బాగుంటుంది లేదంటే ఆ నీటి ని ఐస్ ట్రై లో పోసి మేకప్ చేసుకోవడానికి ముందు అ ఐస్ ముక్కల తో ముఖం రుద్దుకోవచ్చు 


tips for black hair

జుట్టు నల్లగా ఉండటానికి హెయిర్ డైయ్ వేస్తూ ఉంటారు .ఇది పడక చాలా మందికి ఎలెర్జి లు ,తల నెప్పి వస్తుంది .ఇలా కాకుండా జుట్టు నల్లబడాలంటే ఒక కప్పు గోరింటాకు ఒక కప్పు మందార ఆకులు ఒక నాలుగు మందార పూలు రుబ్బి దానిలో ఒక స్పూన్ ఉసిరిక పొడి కలిపి తలకి పెట్టుకోవాలి .ఇలా వారానికి ఒక సారి చేయాలి .దీనివల్ల జుట్టు పెరుగుతుంది.


నల్లబడుతుంది
ఎండు ఉసిరికాయి చూర్ణం ఒక స్పూన్ రెండు స్పూన్ల తేనే లో కలిపి భోజనానికి అరగంట ముందు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది .పచ్చి ఉసిరికాయిలు మెత్తగా రుబ్బి తలకు పెట్టుకుంటే మాడుకు చలవ చేస్తుంది .జుట్టు నల్లబడుతుంది .నాజుగ్గా ఉండాలని కోరుకునేవారు రోజూ ఒక ఉసిరికాయి తింటే మంచిది .
ఉసిరికాయి ఎక్కువ గా దొరికే రోజులలో ఆ కాయిలు తెచ్చి వాటిని ముక్కలు కోసి నీడలో ఆరబెట్టాలి .వీటిని ఒక సీసా లో పోసి నిలవ ఉంచుకొంటే చాల ఉపయోగంగా ఉంటాయి . నీళ్ళ విరేచనాలు అయ్యేటప్పుడు ఈ ఎండు ముక్కలు దంచి ఒక టీ స్పూన్ పొడి మజ్జిగ లో కలిపి తాగుతుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి . 
తల లో వేడి తల దిమ్ము వచ్చి బాధ పడే వారు ఉసిరికాయి చూర్ణం బియ్యం కడిగిన నీటితో గాని గంజి తో గాని కలిపి పేస్టు లాగాచేసి తలకి పట్టించి ఒక గంట తరువాత తలంటి పోసుకోవాలి .ఇలా చేస్తే తలలో వేడి తగ్గిపోతుంది . 
ఎదిగే పిల్లలకు మరమరాల పిండి లో నెయ్యి ,పంచదార కలిపి లడ్డూలు చేసి రోజూ పెడితే చాల బలవర్ధకంగా ఉంటుంది .వ్యాధులు కూడా రానీయవు .

tips for dandraf

తలలో పేలు ఎక్కువగా ఉంటే సీతాఫలం ఆకులు రుబ్బి తలకి పట్టించి ఒక గంట తరువాత స్త్నానం చేస్తే పేలు పోతాయి .
వేప ఆకుల రసం లో నిమ్మరసం తులసి ఆకుల పొడి కలిపి తలకి పట్టించి ఒక అరగంట తరువాత స్నానం చేస్తే  తలలో పేలు ,చుండ్రు పూర్తిగా పోతాయి
వేపాకులు కొన్ని కొంచం తేనె నీళ్ళల్లో వేసి మరిగించాలి ఆ మిశ్రమాన్ని మాడుతో బాటు జుట్టు మొత్తానికి రాసుకుంటే జుట్టుకి మంచి కండిషనర్ గా పని చేస్తుంది .దీనిలొ ఉసిరి పొడి కూడా కలిపితే జుట్టుకి మంచి మెరుపు వస్తుంది
రెండు స్పూన్ల మెంతుల్ని మూడు గంటలు నానబెట్టి దానిలో వేపాకులు వేసి రుబ్బి తలకి పట్టించి ఒక గంట తరువాత తలంటి పోసుకుంటే చుండ్రు పోతుంది
.

వాంతులు అయి నీరసం గా ఉన్న వారికి మరమరాలు జావ కాచి ఉప్పు గాని పంచదార గాని కలిపి తాగిస్తే నీరసం ,నిస్సత్తువ తగ్గుతాయి .ఇది చాల త్వరగా జిర్ణమవుతుంది .వాంతులు కూడా రావు .

Sunday, November 11, 2012

ప్రేగులో అల్సర్లు ,వాపులు తగ్గాలంటే కేవలం మినపపప్పు తో ఆవిరి కుడుములు చేసుకుని తినాలి .ఇంకా కందిపప్పు గాని పెసరపప్పు గాని ఉడికేటప్పుడు ఆ పైన నీరు తీయాలి .ఈ నీటిని కందికట్టు ,పెసర కట్టు అంటారు .ఈ నీటిలో తగినంత ఉప్పు కలుపుకని తాగితే తేలికగా ఆహారం జీర్ణమవుతుంది .
రాత్రి పూట వేడి అన్నంలో పాలు పోసుకుని ఆ అన్నం తో సహా తోడు పెట్టి ఉదయాన్నే తింటే కడుపులో మంటతగ్గుతుంది .ధనియాలు జీలకర్ర నేతిలో విడి విడిగా వేయించి మెత్తగా దంచి తగినంత ఉప్పు కలుపుకుని రోజూ అన్నం లో గాని టిఫిన్ లో గాని తింటే కడుపు లో మంట గుండెలో మంట తగ్గుతాయి .
గుండెల్లో మంట తో బాధ పడుతున్నవారికి అది తగ్గడానికి కొన్ని చిట్కా లు ఉన్నాయి .1విరేచనబద్ధం లేకుండా చూసుకోండి .2 .సోపు నుదోరగా వేయించి ఒక చంచా సోపు ఆహారం తరువాత రెండుపూటలా తీసుకోండి .లోపల ఫైత్యం తగ్గుతుంది ..       3.అల్లాన్ని సన్నగా ముక్కలు తరిగి నేతిలో వేయించి తగినంత ఉప్పు కలిపి ఓ సీసా లో ఉంచుకొని అన్నం తినేటప్పుడు మొదటగా 5లేక ఆరు అల్లం ముక్కలు నెయ్యి వేసుకుని మొదటి ముద్ద లో తినండి .4.తులసి ఆకులు ఎండించి మెత్తగా పొడి చేసి ఒకచంచా పొడి తేనెతో కలిపి రెండు పూటలా తీసుకోండి .గుండె నెప్పి కడుపు నెప్పి రెండు తగ్గుతాయి .
కడుపు లో మంట ఉన్నవారు అది తగ్గాలంటే పీచు పదార్ధాలు ఎక్కువ గా తీసుకోవాలి .మరియు బార్లి ,గోధుమ .గుమ్మడి .కాకర .అరటికాయ .దానిమ్మ ఇంకా ఆవు పాలు వాడితే కడుపులో మంట మందులు వాడకుండా తగ్గిపోతుంది .
జ్వరం వచ్చినప్పుడు లేదా మాములుగా కూడా ఒక్కొక్క సారి పలువరస దంతాలు బాగా నెప్పి గా ఉన్నపుడు ఒకపెద్ద గ్లాస్ వేడి నీటిలో కాస్త ఉప్పు చిన్న పటిక ముక్క వేసి నోటితో పుక్కిలి పట్టాలి .గ్లాస్ లో నీరు అయిపోయేంతవరకు ఇలా చేయాలి .పళ్ళు నెప్పులు తగ్గిపోతాయి .

tulasi.benifits

చంటిపిల్లలకు జలుబు చేసినప్పుడు నాలుగు తులసి ఆకులు కోసి బాగా చేతిలో వేసుకుని నలిపితే రసం వస్తుంది ఆరసాన్ని రెండుచుక్కలు పిల్లల నోటిలో వెయ్యాలి .ఇలా రెండు పూటలా వేస్తే ఒకటి లేదా రెండు రోజులలో జలుబు తగ్గిపోతుంది .ఈ రసాన్ని ఎప్పటికప్పుడే ఫ్రెష్ గా తియ్యాలి
.తులసి రసం లో తేనె కలిపిచంటి పిల్లలకు  నాకించితే పాలు కక్కడం మానేస్తారు .పసి పిల్లలకు వచ్చే వెక్కిళ్ళు తగ్గడానికి కూడా ఇది మందు ఎంతగానో ఉపయోగపడుతుంది . 

Saturday, November 10, 2012

పసిపల్లలు పొట్ట నెప్పి గా ఉండి ఏడుస్తుంటే ఒక తమలపాకు తీసుకుని దానికి ఆముదం రాసి వాళ్ళ పొట్ట మీద ఉంచాలి .ఒకపది నిమిషాల్లో నెప్పి తగ్గి ఆడుకుంటారు .