Saturday, November 10, 2012

ఎవరికైన నీళ్ళవిరేచనాలు అయినప్పుడు వెంటనే ఒక స్పూన్ నేతిలో రెండు స్పూన్ల పంచదార కలుపుకుని తినాలి లేదా .మీగడ పెరుగుఒక అర కప్పు తీసుకుని దానిలో ఒక స్పూన్ మెంతులు కలుపుకుని తిన్నా కూడా చాలా బాగా పని చేస్తాయి .ఈ నెయ్యి పంచదార పసిపిల్లలకు అనగా నెలల పిల్లలకు కూడా పెట్టవచ్చు .కానివాళ్ళకి చిటికెడు మాత్రమే నాలికకు రాయాలి ఇది  చాలాబాగా పని చేస్తుంది .
కడుపు ఉబ్బరం గా ఉండి చిన్న చిన్నగా  విరేచనాలు అవుతుంటే అర చంచా పేరిన నెయ్యి లో పెసర గింజంత ఇంగువ కలిపి తిని మజ్జిగ తాగాలి . తగ్గకపోతే రెండు గంటల తరువాత మళ్లీ అదే పని చెయ్యండి .