Wednesday, November 7, 2012

కీళ్ళ నెప్పులతో బాధ పడేవారు బంగాళాదుంపలు తినడం పూర్తిగా మానేయాలి .టమేటా కూడా తక్కువగా తినాలి .ఎప్పుడైనా ఒక పూట చేసే ఉపవాసాలు కీళ్ళ నెప్పుల బాధను బాగా తగ్గిస్తాయి .
చింత గింజలు వేయించి 2రోజులు నీటిలో నానబెట్టాలి. తరువాత వాటిని పొట్టు తీసి  లోపల పప్పు ను మళ్ళి వేయించి పొడి చేసి దీనికి సమానంగా పటికబెల్లం పొడి కలిపి ఉంచుకోవాలి .ఇది రోజూ రెండు పూటలా ఒక అర స్పూన్ తింటుంటే అరిగిపోయిన ఎముకలు బలపడతాయి .నడవలేనివారు కూడా నడవగలుగుతారు .దీని వలన నరాల నెప్పులు  పిక్కల నెప్పులు కూడా తగ్గి శరీరానికి బలం చేకూరుతుంది .
ఎముకలు కీళ్ళ నెప్పులు ఉన్నవారు జిల్లేడు ఆకులు వేడి చేసి నువ్వుల నూనె గాని ఆముదం గాని రాసి పైన కట్టు కట్టండి ఉపశమనం గా ఉంటుంది