Friday, May 31, 2013

beauty tips

కీరదోస రసానికి గ్లిసరిన్ రోజ్ వాటర్  కలిపి ఆ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచుకుని ఎండ లోకి వెళ్ళడానికి గంట ముందు వచ్చిన తరువాత రాసుకుంటే ఎండ వల్ల ముఖం పాడవ్వదు .
తాజా పాలకి చిటికెడు ఉప్పు నిమ్మ రసం ఒక స్పూన్ కలిపి ముఖానికి రాసుకుని కొన్ని నిమిషాలయ్యాక కడుక్కుంటే చర్మ రంధ్రాలు శుభ్రపడి తెరుచుకుంటాయి దీని వల్ల మొటిమలు పొక్కులు రాకుండా ఉంటాయి
నెయ్యి, గ్లిసరిన్ కలిపి ముఖానికి రాసుకుంటే మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగ పడుతుంది
టమాటో రసానికి నిమ్మరసం కలిపి రాసుకుంటే ముఖం తాజాగా ఉంటుంది
తేనెకి పాల మీగ డ కలిపి ముఖానికి మర్దన చేస్తే ముఖం మృదువు గా ఉంటుంది ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యాలి
ముల్తాని మట్టి గులాబీ రేకులు వేపాకులు తులసి ఆకులూ మిక్సి లో వేసి అ పేస్ట్ ముఖానికి రాసుకుని అర గంట తరువాత కడుక్కోవాలి ఇలా చేస్తే వేరే ఫేషియల్ చేయించనవసరం లేదు