Thursday, November 8, 2012

దురదలు ,దద్దుర్లు వంటి ఎలేర్జిలు తగ్గడానికి వేప చిగుళ్ళు పసుపు కలిపి రాస్తే తగ్గిపోతాయి .దీనికి తోడుగా ఉసిరికపొడి లో ఆవు నెయ్యి కలిపి రోజు ఉదయం,సాయంత్రం ఒక్కొక్క స్పూన్ తినాలి .

గరిక రసాన్ని రాస్తే చర్మం ఫై ఉన్న మచ్చలు తగ్గుతాయి .ఈ రసాన్ని లోపలికి కూడా తీసుకోవచ్చు

కరక్కాయ అరగదీసి ఆ గంధాన్ని కొబ్బరి నూనె లో కలిపి రాస్తే మచ్చలు తగ్గుతాయి

మంచి గంధాన్ని అరగదీసి కొబ్బరి నూనె లో కలిపి రాస్తే ఎలర్జీ లు మచ్చలు బాగా తగ్గుతాయి

శనగలు నానబెట్టి నూరి ముద్ద గా చేసి అంతే పరిమాణం లో వెన్న కలిపి కళ్ళ క్రింద నల్ల మచ్చలకు రాస్తే త్వరగా తగ్గిపోతాయి