Wednesday, November 7, 2012

ఒక నిమ్మపండు రసంలో రెండు స్పూన్ల తినే షోడా వేసి మార్బుల్స్ ని తుడిస్తే మార్బుల్స్ మీద మరకలు పోయి బాగా మెరుస్తాయి .నీటిలో షాంపూ వేసి బట్టలకు వేసే బ్లూ 2చుక్కలు కూడా కలిపి తుడిచినా కూడా మార్బుల్స్ బాగా మెరుస్తాయి .
లెదర్ బాగ్స్ ,పర్స్ లు మరకలు పడినప్పుడు అవి పోవాలంటే ఒక ఉల్లిపాయ తీసుకుని మధ్యకు కోసి ఆ చెక్క తో పర్సులు షూస్ బాగ్ లు రుద్ది ఆ తరువాత వాటిని ఎండ లో పెడితే అవి కొత్తగా మెరుస్తాయి .
చెమ్మగా ఉండే అలమరా లలో నూ బీరువా ల లోనూ కర్పూరం పెడితే ఆ చెమ్మదనం పోతుంది .

బాటిల్స్ కొత్తగా ఉండాలంటే బంగాళదుంపలు ఉడికించిన నీరు పోసి కడగాలి .
నల్లగా అయిన వెండి సామాన్లు తెల్లగా రావాలంటే పుల్ల మజ్జిగ లో నాన బెట్టి ఆ తరువాత టూత్ పేస్ట్ తో కడిగితే తెల్లగా మెరుస్తాయి .