Saturday, November 10, 2012

మొటిమలు జిడ్డు తత్వం ఉన్నవారు గుప్పెడు గులాబీ రేకులు పేస్టు చేసి దానిలో చందనం పొడి కొన్ని చుక్కల తేనె కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి మెడకు రాసుకుని పావుగంట అయ్యాక చల్లని నీటితో కడిగెయ్యాలి
     
మొటిమలు బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్న వారు మెంతికూర ను మెత్తగా పేస్టు చేసుకుని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని ఉదయాన్నే చల్లని నీటితో కడుక్కోవాలి .

కొంత మందికి ముఖానికే కాక మెడ మీద వీపు మీద కూడా మొటిమలు పొక్కులు వస్తూ ఉంటాయి  వీటికి కూడా మెంతి కూర రసాన్ని రాస్తే అవి తగ్గుతాయి 

ముఖం మీద మంగు మచ్చలు ఉన్నవారు తులసి ఆకుల రసం లో తేనె కలిపి రోజు ఫేస్ మాస్క్ వేసుకుని ఒక అరగంట తరువాత కడిగేస్తే మంచి ఫలితముంటుంది .ఇలా కొన్ని రోజులు చెయ్యాలి .

మొటిమల సమస్య వేధిస్తుంటే పుల్లని పెరుగుని రాసి పావుగంట తరువాత కడిగితే మంచి ఫలితముంటుంది .

గడ్డపెరుగు లో తేనె నిమ్మరసం కుంకుమపువ్వు పొడి కలిపి రాసుకుంటే మంచి ఫలితముంటుంది .

గడ్డపెరుగు అలానే ముఖానికి రాసుకుని పావుగంట తరువాత కడిగితే ముఖం బాగా మెరుస్తుంది .

కమలాఫలం తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసి పెరుగులో కలిపి రాసుకుంటే ముఖం మిలమిల మెరుస్తుంది .

నిమ్మ రసం లో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి