Saturday, November 10, 2012

మెడ వెనుక మోచేతులు నల్లగా ఉంటే నిమ్మరసం లో దూది ముంచి ఒక గంట తరువాత చల్లనినీటితో కడిగి
వేయిండి
పని ఎక్కువ అయితే ఆ ప్రభావం ముఖం లో కనిపిస్తుంది చర్మం డల్ గా తయారవుతుంది అప్పుడు ఒకస్పూన్ కీర దోస రసం లో చిటికెడు పసుపు నాలుగు చుక్కలు నిమ్మరసం కలిపి ముఖానికి మెడకు పట్టించి కాసేపయ్యాక చల్లని నీటితో కడిగేస్తే ప్రకాశవంతం గా తయారవుతారు .
. చిన్న పుచ్చకాయి ముక్క తీసుకుని ముఖానికి మెడకు రుద్ది ఆరాక కడిగేయాలి .ఇలా చేస్తే చర్మం మృదువుగా మారి తేటగా కనిపిస్తుంది .చిటికెడు గంధం చిటికెడు పసుపు నీరు కలిపి ముఖానికి రాస్తే పొక్కులు తగ్గుతాయి
మేకప్ వేసుకున్నప్పుడు రిమూవర్ వాడకుండా ముఖానికి ఉన్న మేకప్ ని సులువుగా వదిలించా లంటే పాలలో గాని పెరుగులో గాని దూది ముంచి  తేలికగా తుడిస్తే చాలు కళ్ళ చుట్టూ ఆలివ్ ఆయిల్ రాసి రెండు నిమషాల తరువాత తుడవాలి
చర్మం జిడ్డు గా ఉంటే నిమ్మ చెక్క తో రుద్దుకుంటే మేకప్ తో బాటు ఎక్కువగా ఉన్న జిడ్డు పోతుంది అరటిపండుని పేస్ట్ లా చేసి పాలు కలిపి ముఖానికి రాసుకుని ఆరాక కడుక్కుంటే ముఖం జిడ్డు పోతుంది