Wednesday, November 7, 2012

జీన్స్ డ్రెస్ స్టిఫ్ నెస్ పోయి మెత్తగా రావాలంటే వాష్ చేయడానికి ఒక గంట ముందు నీటిలోఒక చారెడు ఉప్పు కలిపి ఆ నీటిలో జీన్స్ నాన బెట్టి తరువాత ఉతికండి

ఉప్పు వేసిన నీటిలో నానబెట్టి ఉతికితే జీన్స్ రంగు పోకుండా ఉంటాయి .మురికి ఇతర మరకలు ఉన్నా త్వరగా వదలి పోతాయి .సబ్బుతో కన్నా లిక్విడ్ డిటర్జెంట్ తో ఉతికితే జీన్స్ ఎక్కువ కాలం మన్నుతాయి
 .
జీన్స్ రంగు పోతున్నట్లు అనిపిస్తే ముందు కప్పు వెనిగర్ కలిపిన నీటిలో నానబెట్టి అరగంట అయ్యాక లిక్విడ్ డిటర్జెంట్ లో ఉతికి  గంజి పెట్టి ఎండలో ఆరేస్తే రంగు పోకుండా ఉంటాయి .

జీన్స్ వేడినీటిలో ఉతకరాదు . ఇంకా రెండు స్పూన్ల వంట సోడా లో కాస్త వెనిగర్ కలిపి పేస్ట్ లా చేసి మరక ల ఫై రాసి పావుగంట అయ్యాక బ్రష్ తో తేలికగా రుద్దినా కూడా జీన్స్ మిద మరకలు పోతాయి .