Thursday, November 8, 2012

చిన్న వయసు ముఖం మీద ముడుతలు వస్తుంటే అవి తగ్గడానికి రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకుని దానిలో రెండు స్పూన్ల గ్లిసరిన్ వేసి అర కప్పు నీటిలో కలిపి వేరే గిన్నె లో నీరు పోసి ఈ మిశ్రమం పోసిన చిన్న గిన్నెను పెద్ద గిన్నెలో పెట్టి పేస్టు లా అయ్యే వరకు కలిపి స్నానం చేసేటప్పుడు కాకుండా వేరే టైం లో ముఖం తోముకోడం అలవాటు చేసుకోండి .ఇలాఒక నెల రోజులయ్యేసరికి ముడతలు మొత్తం పోతాయి
తులసి రసం పచ్చిపాలు నిమ్మ రసం కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే మొటిమలు మరియు .వాటివలన వచ్చిన మచ్చలు కూడా పోతాయి
ముఖం కందినట్లయితే ఎర్రగా కనిపిస్తుంటే వెంటనే అక్కడ రోజ్ వాటర్ రాస్తే ఉపశమనం కలుగుతుంది
రోజు ముఖానికి రోజ్ వాటర్ రాయడం వల్ల మొటిమలు రావు ఇది మురికిని జిడ్డు ని తొలగించి చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది
రోజ్ వాటర్ రాత్రి ముఖానికి రాసుకుని వదిలేస్తే ఉదయానికి ముఖం తాజాగా ఉంటుంది .