Wednesday, November 7, 2012

శరీరం మృదువుగా ఉండాలంటే మూడు స్పూన్ల రోజ్ వాటర్ తీసుకుని దానిలో ఒక స్పూన్ గ్లిజరిన్ రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలపాలి .దానిని ఒక సీసా లో పోసి ఫ్రిజ్ లో ఉంచుకుని అప్పుడప్పుడు రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది .

రోజ్ వాటర్ లో స్పూన్ బోరాక్స్ పౌడర్ ను రెండు స్పూన్ల వేడి చేసిన ఆలివ్ ఆయిల్  లావెండర్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేసి రాసుకుంటే చర్మం మృదువుగా అవుతుంది .

తేనె ను పెరుగుతో కలిపి ఫేస్ మాస్క్ లా ఉపయోగిస్తే ముఖం బ్రైట్ గా అవుతుంది .

కమలా తొక్కలు ,నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడి చేసి దానిలో సెనగ పిండి కలిపి రాసుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది .

ఒక టీ స్పూన్ నూనె కి ఉప్పు లేదా పంచదార ,నిమ్మరసం కలిపి పేస్టు లా తయారు చేసి వారానికి ఒకసారి శరీరమంతా రుద్దుకోవాలి తరువాత వేడినీటి తో స్నానం చేస్తే శరీరం ఫై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి

చర్మం తాజాగా ఉండాలనుకునే వారు రోజూ పళ్ళ రసం గాని బీట్రూట్ రసం గాని కారెట్ రసం గాని తాగాలి