Wednesday, November 7, 2012

బట్టలమీద లిప్ స్టిక్ మరకలు పడితే పెట్రోలియం జెల్లీ తో రబ్ చేస్తే పోతాయి .లేక ఎదో ఒక టూత్ పేస్టు లిప్ స్టిక్ మరక పై వేసి బాగా రబ్ చేసి ఆ తరువాత ఉతికితే చాలు
 .తుప్పుమరకలు వదలాలంటే దాని మీద ఉప్పు చల్లి తరువాత నిమ్మరసం పులమాలి .ఆ తరువాత నీటి ఆవిరి పట్టించడం గాని ఎండలో పెట్టడం గాని చెయ్యాలి
 .మట్టి మరకలు వదలాలంటే బంగాళా దుంపలు ఉడికించిన నీటి లో నానబెట్టి ఆ తరువాత ఉతకాలి .
తెలుపు బట్టలు రంగు మారకుండా ఉండాలంటే నీటిలో కొంచం హైడ్రోజన్ పెరాక్సైడ్ కలపాలి .వాషింగ్ మెషిన్ లో ఉతికితే అర కప్పు నిమ్మరసం కలిపితే సరిపోతుంది .
మెడ ,కాలర్ దగ్గర బాగా మురికి పట్టి వదలక పోతే ఆ ప్రదేశం లో షాంపూ రాసి బ్రష్ తో రుద్దండి లేదా బేకింగ్ షోడా సుద్దముక్క తో రుద్ది తరువాత ఉతికినా మరక పోతుంది
బట్టల మీద కిళ్ళీ మరకలు పడితే ఉల్లిరసంతో రుద్ది తరువాత డిటర్జెంట్ తో ఉతకాలి
పసుపు మరకలు పోవాలంటే నీటిలో ఒక కప్పు కిరసనాయిలు కలిపి పసుపు బట్టలు నానబెట్టి ఉతకాలి
 బట్టలకు నూనె మరకలయితే పెరుగుతో రుద్ది ఆ తరువాత డిటర్జెంట్ తో ఉతకాలి