Monday, December 3, 2012

pudina.benifits

పుదినా అనేక విటమిన్ల మరియు మినరర్ల సమాహారం అని చెప్పవచ్చు .ఇది అందరికీ అందుబాటు లో ఉండే అసాధారణ ఔషధం .ఇది చాల రకాలయిన అనారోగ్యాలకు మంచి మందు .
1.ఈ .ఆకును గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు ఆహారం లో తీసుకుంటే మంచి ఫలితముంటుంది .కడుపు లో మంట
కీళ్ళనొప్పులు ఉన్న వారికి ఇది చాల మంచిది .
2.పుదినా ను ఆహారం లో తీసుకోవడం చాల తేలిక .దీనిని పొడి గాను ,పచ్చడి గాను ,సాస్ గాను ,టీ చేసుకుని ఇంకా అన్ని కూరలలోను వాడవచ్చు
3ఈ పుదినా త్వరగా జిర్ణమవ్వడమే గాక ఆకలి లేనివారికి ఆకలి కలిగించి జీర్ణ శక్తి ని పెంచుతుంది .
4.రోజు ఈ ఆకులు నాలుగు నమిలితే పిప్పిపళ్ళు రాకుండా చేసి పళ్ళు దంతాలు గట్టిగా ఉంటాయి .నోటి దుర్వాసన ఉన్న వారికి ఇలా నమలడం వల్ల నోరు ఫ్రెష్ గా ఉంటుంది .
5.మొటిమలు ఉన్నవారు రాత్రి నిద్ర పోయేముందు ఈ రసం రాసుకుని ఉదయాన్నే కడిగేయాలి .ఇలా ఒక వారం రోజులు చేస్తే మొటిమలు పోయి ముఖం కాంతివంతం గా అవుతుంది .పొదినా లో ఉండే విటమిన్ ఎ చర్మానికి జిడ్డు పట్టకుండా చేస్తుంది .