Wednesday, December 26, 2012

tomoto.benifits



రోజూ  మనం  ఎన్నో రకాల కూరగాయలు వాడుతూ ఉంటాం .వాటివల్ల ఏ
మేమి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందామా .

1.టమేటా.ఇది రక్తంలోని పదార్ధాలను విసర్జింప జేసి రక్తం శుద్ధి పడేలా చేస్తుంది .ఇది బాగా చలువ చేస్తుంది .ఇది రక్తవృద్ధి ,దేహపుస్టి , బలము ను ఆరోగ్యము ను ఇచ్చును .

2.మలబద్ధకాన్ని నివారించడమే కాక దంతాల గట్టితనానికి ఎంతో ఉపయోగపడుతుంది .షుగర్ వ్యాధి ఉన్న వారికీ టమాటో సలాడ్ తింటే షుగర్ అదుపులో ఉంటుంది .

3.టమా టో  లోవిటమిన్ A ఎక్కువగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగ్గా ఉండడానికి ఎంతో ఉపయోగపడును .

4.దీనిలో ఉండే ఐరన్ వల్ల రక్తహినత రాదు .రక్తహినత ఉన్నవారు రోజు ఒక పండు టమేటా తింటే శరీరానికి రక్తం బాగా పడుతుంది .దీనిలో విటమిన్ c ఉండడంవల్ల గాయాలు ,తగ్గడానికి పిల్లలలో పెరుగుదలకు తోడ్పడుతుంది .దీనికి మరో పేరు రామములగాకాయ .

5.టమాటో లు మగ్గిపోతే  పా రవేయాల్సిన  అవసరం .ఉప్పు నీటి లో వేస్తే ఒకగంట అయ్యే సరికి గట్టిపడి వాడడానికి తయారుగా ఉంటాయి .

6. టమేటా ని గుజ్జు లా చేసి దానిలో తేనే కలిపి ముఖానికి రాసుకుని పది నిమిషాల తరువాత కడిగేస్తే ఇది స్కిన్ టైట్ గా పని చేసి ముఖం త్వరగా ముడుతలు రానీయదు