Monday, November 5, 2012

తలలో చుండ్రు పోవాలన్నా జుట్టు రాలకుండా ఉండటానికి కొన్ని టిప్స్ .
.1.కొన్ని మందార ఆకులు తీసుకుని ఒక అర కప్పు పుల్ల పెరుగు కలిపి పేస్టు చేసుకుని తలకి పట్టించి ఓక గంట లేదాఇంకా కొంచం ఎక్కువ సేపు ఉంచుకొని తలంటి పోసుంకుటే వెంటనే జుట్టురాలడం ఆగిపోతుంది .రెండు లేక మూడుసార్లు పోసుకునేసరికి చుండ్రు కూడా పోతుంది .
2,చుండ్రు బాగా ఎక్కువగా ఉంటే మిరియాలపొడిని పెరుగులో కలిపి మాడుకి తగిలేలా తలకి పట్టిస్తే చుండ్రు తగ్గిపోతుంది ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు మృదువుగా ఆరోగ్యవంతం గా తయారవుతుంది .
3అయిదు  స్పూన్ల మెంతి గింజల పొడికి మూడు స్పూన్ల పెరుగు రెండు స్పూన్ల ఉల్లిపాయ రసం కలిపి తలకు పట్టించి గంట తరువాత స్నానం చెయ్యాలి .ఇలా వారానికి ఒక సారి చేస్తే చుండ్రు సమస్య ఉండదు .