Saturday, January 19, 2013

pototo.healthbenifits

బంగాళాదుంపలు అంటే ఇష్టపడని వారు చాల తక్కువ మంది . పిల్లలకు ఇవంటే చాల ఇష్టం .

వీటిలో కార్బోహైడ్రేట్స్ ,కేలరిస్ ఎక్కువగా ఉండడంవల్ల ఇవి ఎక్కువగా తింటే వెయిట్ పెరుగుతారు .

ఓవర్ వెయిట్ ఉన్నవారు వీటిని తినరాదు .డయా బెటిస్ ఉన్నవారు తింటే దీనిలో ఉన్న కార్బోహైడ్రేట్స్ వల్ల వెంటనే రక్తం లో గ్లూకోస్ శాతం పెరుగుతుంది .అందువల్ల వారు వీటిని తినరాదు .

ఇది చాల తేలిగ్గా జీర్ణమయ్యే శక్తి కలిగిఉండడం వల్ల పేషంట్ల కు త్వరగా శక్తిని ఇస్తుంది .

దీనిలో విటమిన్ c .మరియు b కాంప్లెక్స్ .ఇంకా పొటాషియం మొదలైనవి ఉండడం వల్ల చర్మానికి ఎంతో మంచిది .

పచ్చి బంగాళదుంప ను మెత్తగా క్రష్ చేసి దానిలో తేనె కలిపి ఫేస్ పేక్ వేసుకుంటే ఎంతో బాగా పని చేసి మొటిమలు మచ్చలు మొదలైన స్కిన్ ప్రొబ్లెమ్స్ అన్నీ తగ్గుతాయి ..

వెయిట్ తక్కువగా ఉన్నవారికి ఇది చాల మంచి ఆహారం .అల్సర్ ఉన్నవారికి ఇది మంచిది .అయితే ఎక్కువగా వేపుడు చేసి తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది .కీళ్ళ నెప్పులు ఉన్న వారు తినవచ్చు గాని ఓవర్ వెయిట్ లేని వారు మాత్రమే తినాలి .

టెన్షన్ తో ఉన్నప్పుడు ఇవి తింటే వెంటనే టెన్షన్ తగ్గుతుంది .