Sunday, January 6, 2013

carrot.benifits

క్యారెట్ అందరికి తెలిసినదే .అయితే మనం దేనిని ఒక కూర గా మాత్రమే చూస్తాము
.దీనిలో మనకు తెలియనివి తెలిసినవి ఔషధ గుణాలు చాలా ఉన్నాయి .
దీనిలో ప్రోటీన్ క్రొవ్వులు కార్బోహైడ్రేట్స్ పీచు పదార్ధాలు  కాల్షియం ఐరన్ వంటి పదార్ధాలు మరియు విటమిన్   ABC  ఇంకా రిబోఫ్లోవిన్ఉంటాయి .
క్యారెట్ చెక్కు ని మెత్తగా పొడి చేసి కళ్ళకి కాటుక లాగా పెట్టుకుంటే కళ్ళు దురదలు తగ్గుతాయి .
క్యారెట్ రసం లో పటికబెల్లం మిరియాలపొడి కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది .
రోజు ఉదయం సాయంత్రం క్యారెట్ జ్యూస్ తాగితే గర్భాశయం లో ఉన్న దోషాలు పోతాయి .
 రోజు భోజనానికి ముందు ఒక క్యారెట్  తింటే లావుగా ఉన్న వారు సన్నబడతారు
క్యారెట్ చక్కగా తురిమి పాలలో ఉడికించి పాయసం చేసి బలహీనం గా ఉన్న వారికి తినిపిస్తే గుండెకి పుష్ఠి ని ఇస్తుంది రక్త హీనత నివారించబడుతుంది .