Thursday, January 17, 2013

చిగుళ్ళు ఆరోగ్యం గా ఉండాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి . అవి

1 బ్రష్ చేసుకున్నాక కనీసం 5సార్లు నోటిలో నీళ్ళు పోసుకుని పుక్కిలించాలి .

2చిగుళ్ళు సున్నితంగా ఉన్నవాళ్లు aloevera గుజ్జు తో చిగుళ్ళను మసాజ్ చేయడం వల్ల చిగుళ్ళు చాల ఆరోగ్యం గా ఉంటాయి .

3.చిగుళ్ళు ఆరోగ్యం గా ఉండడానికి విటమిన్ c ఎంతో అవసరం . రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగాలి .ఇంకా ఒక స్పూన్ ఉసిరికపొడి నీటి లో గాని తేనె లో గాని కలుపుకొని తాగితే  చిగుళ్ళ నుంచి రక్తం కారడం తగ్గుతుంది 
.
4. చిగుళ్ళు నెప్పులు గా ఉంటే ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటి లో కొంచం ఉప్పు చిన్న పటిక ముక్క వేసి కలిపి ఆ నీటితో పుక్కిలి పడితే మంచి ఉపశమనం ఉంటుంది
 .
5.తమలపాకు రసం రెండు స్పూన్లు తులసిరసం రెండు స్పూన్లు అర స్పూన్ తేనె కలిపి తీసుకుంటే చిగుళ్ళు ఆరోగ్యం గా ఉంటాయి .

5. తరచుగా పళ్ళు చిగుళ్ళు ఇన్ఫెక్షన్ తో బాధ పడేవారు  రెండు చుక్కలు లవంగ నూనె పళ్ళ మధ్య వేసుకుంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది .

మామిడాకుల తో కషాయం అనగా కొన్ని లేత మామిడి ఆకులు తీసుకుని వాటిని నీటిలో బాగా మరిగించి ఆ నీటిని పుక్కిలి పడితే పంటి నెప్పులు ,చిగుళ్ళ వాపులు ,నోటి పూత బాగా తగ్గుతాయి .